: దిగివచ్చిన సోమేశ్ కుమార్... కుదరదన్న జీహెచ్ఎంసీ కార్మికులు!


మునిసిపల్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె మరింత తీవ్ర రూపం దాల్చింది. ఎనిమిది రోజులుగా సమ్మెలో ఉన్న మునిసిపల్ కార్మికులు, తమ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకునేదాకా విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల్లో దుర్గంధం రాజ్యమేలుతోంది. గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో పరిస్థితి మరింత విషమించింది. అంతేకాక రంజాన్ నేపథ్యంలో కార్మికుల సమ్మె సర్కారును ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం లేకపోలేదు. ఈ కారణంతోనే నేటి ఉదయం జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ దిగివచ్చారు. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ను దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమించాలని ఆయన కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చే విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని, వేతనాలు పెంచే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని కూడా ఆయన కార్మికులకు సమాచారం పంపారు. తక్షణమే సమ్మె విరమించాలని ఆయన కార్మికులను కోరారు. అయితే ముందు తమ డిమాండ్లను నెరవేర్చాలని, ఆ తర్వాతే సమ్మె విరమిస్తామని కార్మికులు సోమేశ్ కుమార్ కు తేల్చిచెప్పారట.

  • Loading...

More Telugu News