: సండ్రకు బెయిల్ వచ్చేనా?... నేడు బెయిల్ పిటీషన్ పై ఏసీబీ కోర్టు విచారణ


ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడిగా తెలంగాణ ఏసీబీ పేర్కొన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. ఏసీబీ కోర్టులో జరగనున్న ఈ విచారణపై టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల నేతల్లోనే కాక తెలుగు రాష్ట్రాల ప్రజల్లో సైతం ఆసక్తి నెలకొంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ ఓటును కొనుగోలు చేసేందుకు యత్నించిన టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి అరెస్టైన తర్వాత ఈ కేసులో సండ్రకు కూడా ప్రమేయముందని ఏసీబీ ఆరోపించింది. విచారణకు హాజరుకావాలంటూ ఏసీబీ జారీ చేసిన నోటీసులకు సండ్ర దాదాపు నెల రోజులు ఆలస్యంగా స్పందించారు. అనారోగ్యం పేరిట ఏపీలోని కార్పొరేట్ ఆస్పత్రిలో సుదీర్ఘ చికిత్స తీసుకున్న సండ్ర ఇటీవలే ఏసీబీ విచారణకు హాజరయ్యారు. సండ్రను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు, కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు వివిధ కోణాల్లో విచారించారు. సండ్ర దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ పై విచారణ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా, నేటి విచారణలో కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

  • Loading...

More Telugu News