: జర్నీ మొదలెట్టిన ‘చెర్రీ’ విమానాలు...ట్రూజెట్ సేవలను ప్రారంభించిన అశోక్ గజపతిరాజు
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ తేజ్ భాగస్వామ్యంతో ఏర్పాటైన టర్బో మేఘా ఏవియేషన్ సేవలు నిన్న ఘనంగా ప్రారంభమయ్యాయి. శంషాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న జరిగిన కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు టర్బో మేఘా విమానం ‘ట్రూజెట్’ను ప్రారంభించారు. తొలి విమానం హైదరాబాదు నుంచి తిరుపతి బయలుదేరింది. ఈ కార్యక్రమానికి టర్బో మేఘా డైరెక్టర్ గా ఉన్న రామ్ చరణ్ తేజ్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, సంస్థ డైరెక్టర్లు ప్రేమ్ కుమార్, ఉమేశ్ తదితరులు హాజరయ్యారు.