: 'జింజర్ జిహాదీ'ని పెళ్లాడిన బ్రిటీష్ విద్యార్థిని


ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు కార్యకలాపాల పట్ల ఆకర్షితులవుతున్న పాశ్చాత్య దేశాల బాలికలు ఇరాక్, సిరియా దేశాల బాట పడుతుండడం తెలిసిందే. ఫిబ్రవరిలో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి బ్రిటన్ ను వీడిన అమీరా అబ్బాసి అనే 16 ఏళ్ల బాలిక ఓ ఐఎస్ జిహాదీని వివాహం చేసుకున్నట్టు తెలిసింది. అమీరా లండన్ లో హైస్కూల్ విద్యను అభ్యసిస్తోంది. ఆస్ట్రేలియా జాతీయుడైన అబ్దుల్లా ఎల్మిర్ అనే ఈ జిహాదీకి 'జింజర్ జిహాదీ' అని పేరు. అతని జుట్టు అల్లం (జింజర్) రంగులో ఉండడమే అందుకు కారణం. కాగా, అమీరా అబ్బాసీ సిరియా వెళ్లి ఐఎస్ లో చేరినట్టు తెలుసుకున్న నిఘా వర్గాలు, తాజాగా ఆమె ఓ జిహాదీని పెళ్లాడినట్టు గుర్తించారు. శనివారం వీరి వివాహం జరిగినట్టు సమాచారం. అటు, 'జింజర్ జిహాదీ' అబ్దుల్లా ఎల్మిర్ కూడా అమీరాతో తన వివాహాన్ని ఇంటర్నెట్ ద్వారా నిర్ధారించాడు. ఎల్మిర్ ఐఎస్ విడుదల చేసిన అనేక వీడియోల్లో కనిపించాడు. రెండేళ్ల కిందట సిడ్నీలో ఓ మాంసం దుకాణంలో పనిచేసిన ఈ యువకుడు అనంతరం సిరియాకు వెళ్లి ఐఎస్ గ్రూపులో చేరాడు. ఎల్మిర్ కరుడుగట్టిన మిలిటెంట్ అని నిఘా వర్గాలంటున్నాయి.

  • Loading...

More Telugu News