: లఖ్వీ, దావూద్ లను మోదీ భారత్ తీసుకువచ్చి ఉరితీయిస్తారని ఆశిస్తున్నాం: తొగాడియా


విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) చీఫ్ ప్రవీణ్ తొగాడియా అహ్మదాబాద్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముంబయి పేలుళ్ల కేసులో కీలక నిందితుడు జకీయుర్ రెహ్మాన్ లఖ్వీ, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంలను ప్రధాని నరేంద్ర మోదీ భారత్ తీసుకువచ్చి ఉరితీయిస్తారని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు. చేసిన తప్పులకు వాళ్లిద్దరినీ ఉరి తీయడం ద్వారా మోదీజీ ఇతరులకు గుణపాఠం చెబుతారని తమకు గట్టి నమ్మకం కలుగుతోందని తెలిపారు. ఇక, రామమందిర నిర్మాణానికి లోక్ సభలో సాధారణ మెజారిటీ సరిపోతుందని అన్నారు. 'లవ్ జిహాద్' పై ఆగస్టులో రాష్ట్రాల వారీగా అవగాహన కార్యక్రమాలను చేపడతామన్నారు.

  • Loading...

More Telugu News