: అంతా అల్లా దయ... చేయాల్సింది చాలా ఉంది: కేసీఆర్
నిజాం కళాశాల మైదానంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ... అల్లా దయ వల్ల 'తెలంగాణ' సాకారమైందని అన్నారు. అన్ని వర్గాలు తెలంగాణను కోరుకున్నాయని వివరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అందరం పోరాడామని పేర్కొన్నారు. తాను ఇప్పటి వరకు చేసింది చాలా తక్కువని, ఇంకా ఎంతో చేయాల్సి ఉందని తెలిపారు. రంజాన్ సందర్భంగా లక్షా 96 వేల మంది పేద ముస్లింలకు సర్కారు తరపున దుస్తులు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు.