: న్యూయార్క్ నుంచి లండన్ కు 3 గంటలే... ఎస్-512 విమానంతో సాధ్యమంటున్న 'స్పైక్'


మామూలుగా, మధ్యలో ఎక్కడా ఆగకుండా విమానంలో న్యూయార్క్ నుంచి లండన్ వెళ్లేందుకు దాదాపు 6.18 గంటల సమయం పడుతుంది. అది కూడా విమానం సగటున గంటకు 560 మైళ్ల వేగం తగ్గకుండా ప్రయాణిస్తేనే. ఈ రెండు నగరాల మధ్య దూరం సుమారు 3461 మైళ్లు. బోస్టన్ కు చెందిన స్పైక్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన ఎస్-512 సూపర్ సోనిక్ విమానంలో కేవలం 3 గంటల్లోనే న్యూయార్క్ నుంచి లండన్ చేరుకోవచ్చట. ఈ విమానం మాగ్జిమమ్ స్పీడు మాక్ 1.8 (గంటకు 2,205 కిలోమీటర్లు). అంటే ధ్వనివేగానికి 1.8 రెట్లు అధికం అన్నమాట. ఈ విమానాన్ని 2013లోనే తెరపైకి తెచ్చినా, తాజాగా, కొన్ని మార్పులతో విమానాన్ని రీ-డిజైన్ చేశారు. మార్పుల కారణంగా విమానం వేగం మరింత పెరిగిందని సంస్థకు చెందిన ఇంజినీర్లు తెలిపారు. కొత్త 'డెల్టా వింగ్స్' కారణంగా అధికవేగం సాధ్యమైందని ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న భారత సంతతి సీనియర్ ఇంజినీర్ అనుతోష్ మొయిత్రా వివరించారు. తమ సూపర్ సోనిక్ లగ్జరీ జెట్ లో ప్రయాణికులు పారిస్ నుంచి దుబాయ్ వెళ్లి అక్కడ షాపింగ్ చేసుకుని, వినోద కార్యక్రమాల్లో పాల్గొని డిన్నర్ సమయానికి ఇంటికి తిరిగిరావచ్చని సంస్థ చెబుతోంది.

  • Loading...

More Telugu News