: తెలంగాణ కోసం సమ్మె చేయొచ్చుగానీ, పొట్టకూటి కోసం సమ్మె చేస్తే తప్పా?: కిషన్ రెడ్డి


మున్సిపల్ కార్మికుల సమ్మెపై బీజేపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా, కార్మికుల మధ్య చీలికలు తెచ్చేందుకు సర్కారు ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. మున్సిపల్ శాఖ సీఎం కేసీఆర్ వద్దే ఉందని, అయినా గానీ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించకపోవడం హేయమని విమర్శించారు. కార్మికులు తెలంగాణ కోసం సమ్మె చేయవచ్చు గానీ, పొట్టకూటి కోసం సమ్మె చేస్తే తప్పా? అని సర్కారును నిలదీశారు. కార్మికుల సమస్యలు న్యాయబద్ధమైనవని, వాటిని పరిష్కరించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News