: రాజధాని కోసం నారా బ్రాహ్మణికి చెక్కు అందించిన 'వారాహి' అధినేత
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం 'బాహుబలి' ముందస్తు ప్రదర్శనల కలెక్షన్లను విరాళంగా ఇస్తామని వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రకటించడం తెలిసిందే. ముందస్తు ప్రదర్శనల ద్వారా రూ.24,56,789 వసూలైనట్టు తెలిసింది. దాంతో, ఆ మొత్తం తాలూకు చెక్కును సాయి కొర్రపాటి ఆదివారం నారా బ్రాహ్మణికి అందజేశారు. సాయి గతంలోనూ హుదూద్ తుపాను బాధితులకు తన వంతుగా 100 టన్నుల బియ్యాన్ని అందజేసి సహృదయతను చాటుకున్నారు.