: ఇస్రో వాణిజ్య వెబ్ సైట్ పై చైనా హ్యాకర్ల దాడి!


భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో' ఇప్పుడు ప్రపంచస్థాయికి ఎదిగింది. వాణిజ్య పరంగానూ ఉపగ్రహాలను రోదసిలోకి పంపుతూ దేశానికి గర్వకారణంగా నిలుస్తోంది. తాజాగా, బ్రిటీష్ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి అంతర్జాతీయ సమాజానికి తన సత్తాను ఘనంగా చాటింది. అయితే, ఈ ఘనవిజయాల పట్ల హ్యాకర్లకు కన్నుకుట్టినట్టుంది! ఇస్రో వాణిజ్య విభాగం 'యాంత్రిక్స్' వెబ్ సైట్ పై హ్యాకర్లు దాడిచేశారు. దాంతో, అది పనిచేయడంలేదు. 'యాంత్రిక్స్'ను హ్యాక్ చేసింది చైనా హ్యాకర్లే అని అనుమానిస్తున్నారు. ఈ వెబ్ సైట్ యూఆర్ఎల్ ఓ క్రీడా ఉపకరణాలకు సంబంధించిన వెబ్ పేజీకి దారితీస్తోంది. దీనిపై ఇస్రో వర్గాలు వెంటనే స్పందించాయి. సైట్ పునరుద్ధరణకు అధికారులు యత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News