: భద్రాచలం తరలివస్తున్న హిమాలయ నాగ దిగంబర సాధువులు


పవిత్ర గోదావరి పుష్కరాల్లో పాలు పంచుకునేందుకు హిమాలయాల్లో అత్యంత క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా తిరిగే నాగ సాధువులు వస్తున్నారు. వీరందరికీ ఆతిథ్యమిచ్చేందుకు భద్రాచలంలో రూ. కోటికి పైగా నిధులను తెలంగాణ సర్కారు మంజూరు చేసింది. నాగాలతో పాటు ఐదారు రకాల వర్గాలకు చెందిన సాధువులు అసోం, కాశీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల నుంచి భద్రాచలం వస్తుండటంతో ఈ ప్రాంతం సరికొత్త ఆధ్యాత్మిక కళను సంతరించుకుంది. ఒంటినిండా విభూది, మెడలో రుద్రాక్షలు, చేతుల్లో త్రిశూలాలు ధరించి వచ్చే వీరి నుంచి ఆశీస్సులను పొందేందుకు యాత్రికులు వేచి చూస్తున్నారు. సుమారు 2 వేల మంది వరకూ సాధువులు వస్తుండటంతో సారపాక అటవీ ప్రాంతంలో వీరికి బస, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో 14 నుంచి 25 వరకూ విశ్వశాంతి మహాయజ్ఞం జరగనుంది. సాధువులకు 16న శ్రీసీతారామచంద్ర స్వామివారి దర్శనం చేయిస్తామని, ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News