: చంద్రబాబుపై తెలంగాణలో మరో కేసు
ఏ మాత్రం అవకాశం వచ్చినా, చంద్రబాబుపై కేసులు పెట్టేందుకు ఉరుకులెత్తే తెలంగాణ న్యాయవాదుల జేఏసీ తాజాగా మరో కేసు పెట్టింది. ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని కొనేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు యత్నించిందని వికీలీక్స్ వెల్లడించడంతో దాని ఆధారంగా బంజారాహిల్స్ పోలీసు స్టేషనులో న్యాయవాదులు కేసు పెట్టారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కూలదోసేందుకు చేసిన కుట్రలో భాగంగానే బాబు ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని కొనాలని నిర్ణయించుకున్నారని వారు ఫిర్యాదు చేశారు. తెలంగాణలోని 50 మంది నేతలు, అధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని న్యాయవాదులు గోవర్దన్ రెడ్డి, ఉపేంద్ర తదితరులు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.