: గవర్నరుతో భేటీ అయిన చంద్రబాబు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ఉదయం కలిశారు. ఉదయం 9:30 గంటల సమయంలో రాజ్ భవన్ కు వెళ్లిన ఆయన నరసింహన్ తో కాసేపు గడిపారు. రాజమండ్రిలో ఎల్లుండి ప్రారంభం కానున్న గోదావరి మహా పుష్కరాలకు గవర్నరును ఆహ్వానించేందుకే బాబు వచ్చారని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. బాబు ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన నరసింహన్ తప్పకుండా వస్తానని తెలియజేసినట్టు సమాచారం. పుష్కరాల తొలి రోజు కుదరకుంటే మలిరోజు గవర్నరు రాజమండ్రికి వెళ్తారని తెలుస్తోంది.