: తుపాకీ చూపి పనిమనిషిపై అత్యాచారం చేసిన పోలీసు అధికారి... తక్షణం డిస్మిస్ చేస్తామన్న ఢిల్లీ పోలీసు కమిషనర్


తన స్నేహితుడి ఇంటికి వెళ్లి ఫుల్లుగా మందుకొట్టిన ఓ పోలీసు అధికారి, తుపాకీతో బెదిరించి ఆ ఇంటి పనిమనిషిపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఇంట్లో అమర్చిన సీసీటీవీ వీడియో సాక్ష్యంతో వెలుగులోకి రావడంతో క్షణం ఆలస్యం చెయ్యకుండా అతన్ని డిస్మిస్ చేయనున్నట్టు ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. పనిమనిషిని తుపాకీతో బెదిరిస్తున్న దృశ్యాలతో పాటు, ఆమె వచ్చి పక్కన కూర్చోవడం, బట్టలు తొలగించడం వంటి దృశ్యాలు, ఆపై జరిగిన దురాగతం మొత్తం రికార్డయింది. బాధితురాలి (23) ఫిర్యాదుతో కేసు పెట్టిన పోలీసులు అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ జగ్వీర్ సింగ్ ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. మహిళలపై జరిగే ఎటువంటి హింసనూ తాము సహించేది లేదని, ఈ కేసులో డిపార్టుమెంట్ విచారణ కోసం ఎదురుచూడబోవటం లేదని బస్సీ వివరించారు.

  • Loading...

More Telugu News