: ఆసుపత్రి నుంచి పారిపోయిన హర్షకుమార్


ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పారిపోయారు. గత రాత్రి హర్షకుమార్ ను బలవంతంగా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అంతకుముందు దీక్షా వేదికపై తుపాకీతో కాల్పులు జరిపిన ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తీసుకురాగా, అక్కడి నుంచి బయటకు వచ్చి తన అనుచరుడి ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయారు. అనంతరం కాసేపటికి రాజమండ్రి మూడవ పట్టణ పోలీసు స్టేషనులో లొంగిపోయారు. తుపాకీ కాల్పుల ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు హర్షకుమార్ పై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

  • Loading...

More Telugu News