: రూ. 3.34 కోట్లు కొట్టేసిన సానియా మీర్జా జోడీ
వింబుల్డన్ లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. టెన్నిస్ మాజీ నంబర్ వన్ మార్టినా హింగిస్ తో కలసి జతకట్టిన సానియా మీర్జా, వింబుల్డన్ పోటీల్లో చరిత్ర సృష్టించింది. మహిళల డబుల్స్ విభాగంలో మకరోవా జోడీపై 5-7, 7-6, 7-5 తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సానియా మీర్జా జోడీకి రూ. 3.34 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్ లుగా మిగిలిన మకరోవా జంటకు 1.25 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. అంతర్జాతీయ టెన్నిస్ పోటీల్లో ఆడటం మొదలుపెట్టిన 12 సంవత్సరాల తరువాత సానియా మీర్జా, హింగిస్ తో కలసి వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ గెలవడం గమనార్హం.