: కాల్పులు జరిపిన మాజీ ఎంపీ హర్షకుమార్
శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ, మాజీ ఎంపీ హర్షకుమార్ చేస్తున్న నిరాహారదీక్షను పోలీసులు శనివారం రాత్రి భగ్నం చేశారు. పోలీసులు దీక్షా వేదిక వద్దకు వచ్చిన సమయంలో, తనను తీసుకెళితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ, ఆయన తన తుపాకీతో గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. కొంతసేపు ఏం జరుగుతోందో అర్థంకాని పరిస్థితి. పరిస్థితి విషమిస్తుండడంతో స్పెషల్ పార్టీ పోలీసులు రంగప్రవేశం చేసి, తీవ్ర ఉద్రిక్తత మధ్య హర్షకుమార్ అనుచరులను పక్కకు తప్పించారు. హర్షకుమార్ ను బలవంతంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తుపాకీని స్వాధీనం చేసుకుని ఆయనపై మరో కేసు పెట్టారు.