: 'బాహుబలి' ఎక్స్ ట్రా వినోదం... చేరిన రెండో పార్ట్ దృశ్యాలు!


బాహుబలి చిత్రాన్ని చూసిన సినీ ప్రేక్షకులను మరోసారి థియేటర్ కు రప్పించేందుకు జక్కన్న మరో ప్లాన్ వేశాడు. చిత్రం ముగింపు ప్రేక్షకులకు నిరాశ కలిగించిందన్న విశ్లేషణల నేపథ్యంలో రెండో పార్ట్ లోని కొన్ని దృశ్యాలను కలిపారు. ఈ విషయాన్ని చిత్ర ప్రతినిధి ట్వీట్ చేశారు. శనివారం నాడు క్యూబ్ ప్రింట్లలో వీటిని కలిపామని, పీఎక్స్ డీ, యూఎఫ్ఓ వంటి ఇతర డిజిటల్ ప్రింట్లలో ఆదివారం కలుపుతామని తెలిపారు. కొత్త దృశ్యాలను చేర్చిన కారణాన్ని మాత్రం యూనిట్ ప్రకటించలేదు. ఈ కొత్త దృశ్యాలు సినీ అభిమానులకు ఆనందం కలిగిస్తాయనడంలో సందేహం లేదు.

  • Loading...

More Telugu News