: మా స్నేహానికి 21 ఏళ్లు...ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది: వరుణ్ ధావన్


'ఎనీబడీ కెన్ డాన్స్ (ఏబీసీడీ) 2' సినిమా విజయోత్సవాన్ని దర్శక నిర్మాతలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సల్మాన్ ఖాన్, సినీ నట బృందం పాల్గొన్నారు. కాగా, ఈ సందర్భంగా సినిమా హీరో వరుణ్ ధావన్, శ్రద్ధాకపూర్ తో సెల్ఫీ తీసి ట్విట్టర్లో పెట్టాడు. తామిద్దరం 21 ఏళ్లుగా స్నేహితులమని, తమ స్నేహం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించాడు. కాగా, 'ఏబీసీడీ-3' సినిమాను తీస్తే అందులో వరుణ్, శ్రద్ధాలనే నటీనటులుగా ఎంచుకుంటానని దర్శకుడు రెమో డిసౌజా తెలిపాడు. అలాగే, తాను నటించిన 'హంప్టీ శర్మకీ దుల్హన్' సినిమా విడుదలై ఏడాది పూర్తయిందని గుర్తుచేసుకున్నాడు. ఈ సినిమా తన జీవితాన్ని మార్చేసిందని పేర్కొన్నాడు. కాగా, ఈ సినిమాలో వరుణ్ ధావన్ సరసన అలియా భట్ నటించింది. ఈ సినిమా బిగ్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News