: యువతరానికి ఏం విడిచిపెట్టాము?...గాయాలు, కన్నీరు తప్ప!: ట్విట్టర్లో పవన్ కల్యాణ్ ఆవేదన
ట్విట్టర్ ద్వారా పవన్ కల్యాణ్ సమాజానికి మరో సూటి ప్రశ్న సంధించారు. యువతరానికి ఏ సంపదలు విడిచిపెట్టాము? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప!...గాయాలు, బాధలు వేదనలు తప్ప!... కలలు, కల్లలు, పిరికితనం, మోసం తప్ప!. అంటూ ట్విట్టర్ మాధ్యమంగా మరోసారి ఆలోచనను, చర్చను రేకెత్తించారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ప్రశ్నించడం లేదేంటి? అంటూ పలువురు రాజకీయ నాయకులు అడగడంతో ఆయన మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఎంపీలను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా పవన్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు.