: షాదీఖానా, శ్మశాన వాటిక కోసం హర్షకుమర్ నిరాహార దీక్ష
రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్షకుమార్ చేపట్టిన నిరాహార దీక్ష శిబిరం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముస్లింలకు షాదీఖానా, క్రైస్తవులకు శ్మశాన వాటిక కట్టాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరాహార దీక్షకు దిగారు. నిన్నటి నుంచి ఆయన దీక్ష చేస్తుండగా, ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు. దీంతో పెద్దఎత్తున పోలీసులు దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు వచ్చారని ఆరోపిస్తూ, హర్షకుమార్ మద్దతుదారులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.