: పోలవరం నీళ్లలో వాటా కావాలి: ఎంపీ కవిత


పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే ఎస్ఎల్ బీసీ కింద తెలంగాణకు 30 టీఎంసీల నీరివ్వాలని నిజామాబాద్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, ఆంధ్రాకు నీరిచ్చేందుకే పులిచింతల ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. జూరాల ఆయుకట్టుకింద రైతులకు అన్యాయం జరుగుతోందని ఆమె విమర్శించారు. 60 ఏళ్ల ఆంధ్ర పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆమె ఆరోపించారు. నీటి వనరుల విషయంలో చంద్రబాబు తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేశారని ఆమె పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కమిషన్ల పర్వానికి తెరలేపింది చంద్రబాబేనని ఆమె విమర్శించారు. నిజామాబాద్ కు బాబు అన్యాయం చేస్తే, తెలంగాణ వచ్చిన తరువాత మిషన్ కాకతీయ ద్వారా మహబూబ్ నగర్ జిల్లాలో 800 చెరువులు బాగుచేసుకున్నామని ఆమె చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతోందని ఆమె వెల్లడించారు.

  • Loading...

More Telugu News