: జానారెడ్డిని మార్చం...డీఎస్ వల్ల ఉపయోగం లేదు: కుంతియా
తెలంగాణ సీఎల్పీ నేతగా జానారెడ్డి కొనసాగుతారని ఏఐసీసీ ప్రతినిధి కుంతియా స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పదవుల్లో కొనసాగుతున్న పార్టీ నేతలపై అభిప్రాయ సేకరణ చేపట్టలేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వాలను లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. డీఎస్ లాంటి వారు అధికారం కోసం పార్టీ మారుతున్నారని, అలాంటి వారి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 24న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారని ఆయన తెలిపారు.