: షారుఖ్ కూడా 'బాహుబలి' తర్వాతే... హిస్టరీ క్రియేట్ చేసిన 'బాహుబలి'


తెలుగు వారికి, తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైన 'బాహుబలి'... దేశ చలనచిత్ర రంగంలో రికార్డులు బద్దలు కొట్టింది. రిలీజైన తొలిరోజే రూ. 50 కోట్లను వసూలు చేసింది. 2014లో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనేల కాంబినేషన్లో వచ్చిన 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమా తొలిరోజు రూ. 44.97 కోట్లను వసూలు చేసింది. మన దేశ సినీ చరిత్రలో 'హ్యాపీ న్యూ ఇయర్'దే ఇప్పటిదాకా హైయ్యెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్. ఇప్పుడు దీన్ని అధిగమించిన 'బాహుబలి' సెన్షేషన్ క్రియేట్ చేసింది. దీనిపై ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో స్పందించారు. "బాహుబలి చరిత్ర సృష్టించింది. తొలిరోజే ఎన్నడూ లేనంతగా 50 కోట్ల బిజినెస్ చేసింది. ఇదొక అద్భుతం, అపూర్వం" అంటూ కొనియాడారు.

  • Loading...

More Telugu News