: చంద్రబాబుపై విరుచుకుపడిన రోజా


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్సార్సీపీ నేత రోజా విరుచుకుపడ్డారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబు వెధవ వేషాలు వేస్తున్నారని అన్నారు. ఎన్నికల సందర్భంగా మహిళలందరికీ రక్షణగా ఉంటానన్న బాబు, మహిళా ఎమ్మార్వోపై దాడి జరిగితే బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేను శిక్షించాల్సిన వ్యక్తి రాయబారం నడపడం ఏంటని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహారశైలి మహిళా లోకానికి విరుద్ధంగా ఉందని ఆమె ఆరోపించారు. మహిళలంతా మద్య నిషేధం కోరుతుంటే, వీధికో మద్యం షాపు తెరిచి మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఓటుకు నోటు కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, ట్యాపింగ్ కు బాధ్యురాలిని చేస్తూ అనురాధను బదిలీ చేశారని అన్నారు. ఎమ్మెల్యే మహిళా అధికారిణిపై దాడి చేస్తే, చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు బ్రోకర్ షిప్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఆడకూతురుపై దురుసు ప్రవర్తన ఏంటని నిలదీసిన భూమాను అట్రాసిటీ కేసు పేరిట వేధిస్తూ, మహిళల్ని అవమానిస్తున్నారని ఆమె ఆరోపించారు. మహిళా అధికారిపై దాడి జరిగితే స్పందించకుండా మహిళా మంత్రులు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News