: తలసానిని బర్తరఫ్ చేయమని కేసీఆర్ ను కోరనున్న గవర్నర్?
తెలంగాణ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలో గవర్నర్ నరసింహన్ చాలా సీరియస్ గా ఉన్నారట. ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా చేసినప్పటికీ, దాన్ని ఇంకా ఎంత కాలం పెండింగులో పెడతారంటూ స్పీకర్ మధుసూదనాచారిని గవర్నర్ ప్రశ్నించారట. ఈ వ్యవహారంలో స్పీకర్ నిర్ణయం తీసుకోలేకపోతే... తలసానిని బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరతానని గవర్నర్ అన్నట్టు సమాచారం. తలసాని అంశంపై రాష్ట్రపతితో బాటు, కేంద్ర హోంశాఖ కూడా గవర్నర్ ను ప్రశ్నించిందట. దీంతో, ఈ విషయంలో గవర్నర్ సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తోంది.