: వికీలీక్స్ వెల్లడించిందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు: యనమల
ట్యాపింగ్ పరికరాల కొనుగోలు కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నించిందంటూ వికీలీక్స్ వెల్లడించిందని వార్తలు వస్తున్నాయని... ఈ వార్తల్లో వాస్తవం లేదని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని సూచించారు. ఏపీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి కొన్ని పార్టీలు, వారి తొత్తులుగా ఉన్న ఛానళ్లు కుట్రలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. వికీలీక్స్ పేరిట వస్తున్న వార్తలతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు.