: రాజమండ్రి బయలుదేరిన చంద్రబాబు... పుష్కరాల ప్రారంభం దాకా ఉభయగోదావరి జిల్లాల్లోనే మకాం


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం హైదరాబాదు నుంచి రాజమండ్రి బయలుదేరి వెళ్లారు. జపాన్ పర్యటన ముగించుకుని మొన్న ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నిన్న కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. ఆ తర్వాత నిన్న రాత్రికే హైదరాబాదు చేరుకున్న చంద్రబాబు, నేటి ఉదయం రెవెన్యూ ఉద్యోగులు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ లతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన నేరుగా రాజమండ్రి బయలుదేరివెళ్లారు. ఇక ఈ నెల 14న గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యే దాకా చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల్లోనే పర్యటిస్తారు. ఈ నెల 14న గోదావరి పుష్కరాలను ప్రారంభించిన అనంతరం ఆయన తిరిగి హైదరాబాదుకు వస్తారు.

  • Loading...

More Telugu News