: ప్రాణహాని ఉందని భత్కల్ చెబితే మేమేం చేసేది?... జైల్లో ఉన్నంత కాలం క్షేమంగానే ఉంటాడు: జైళ్ల శాఖ డీజే
జైళ్ల శాఖ డీజీ చెబుతున్న మాటలు వింటుంటే... ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు, దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు అయిన యాసిన్ భత్కల్ తప్పించుకునే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. జైలు నుంచి కోర్టు విచారణ కోసం తరలించేటప్పుడు భత్కల్ తప్పించుకునే అవకాశం లేకపోలేదని డీజీ వీకే సింగ్ అన్నారు. ఈ కారణం వల్లనే, భత్కల్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని కోర్టును కోరామని... అయితే, ట్రయల్స్ ఉన్నందున కచ్చితంగా కోర్టుకు తీసుకురావాల్సిందేనని కోర్టు ఆదేశించిందని తెలిపారు. ఈ ఆదేశాలు తమకు ఇబ్బందికరమే అయినప్పటికీ... కోర్టు ఆదేశాలను పాటించాల్సిందే అని చెప్పారు. తనకు ప్రాణ హాని ఉందని భత్కల్ కోర్టు వద్ద విసిరిన లేఖపై స్పందించిన వీకే సింగ్... ఆయనకు ప్రాణహాని ఉందని చెబితే పోలీసులు ఏం చేయగలరని... జైల్లో ఉన్నంత వరకు మాత్రం ఆయన క్షేమంగానే ఉంటారని అన్నారు.