: ఆ అవసరం మాకు లేదు...టీ సర్కారు ఆరోపణపై కేంద్రానికి చంద్రబాబు క్లారిటీ


తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు ఎంతమాత్రం లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. మొన్న జపాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నిన్న పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయిన సందర్భంగా తమపై తెలంగాణ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తెలంగాణ సర్కారును కూల్చాల్సిన అవసరం తమకు లేదన్న చంద్రబాబు, ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు. ఈ క్రమంలో కేసీఆర్ తో సమావేశానికీ అభ్యంతరం లేదన్నారు. అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ పెద్దలే ఆసక్తి చూపడం లేదని కూడా చంద్రబాబు, రాజ్ నాథ్ సింగ్ కు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News