: ఆకతాయి 'ట్వీట్'తో జెట్ ఎయిర్ వేస్ విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్


ముంబై నుంచి దుబాయ్ వెళ్తున్న జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని అనూహ్యంగా మస్కట్ లో దించేందుకు కారణం ఓ భారతీయ యువకుడని ముంబై విమానాశ్రయాధికారులు తెలిపారు. జెట్ ఎయిర్ వేస్ 9 డబ్ల్యూ 356 విమానంలో బాంబు ఉందంటూ ట్వీట్ రావడంతో అప్రమత్తమైన అధికారులు అత్యవసరంగా మస్కట్ లో దించేశారు. అనంతరం సోదాల్లో బాంబు లేదని తేలడంతో విమానం పయనమైంది. అనంతరం ట్వీట్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై దర్యాప్తు ప్రారంభించారు. రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన సురేందర్ ప్రతాప్ అనే పాతికేళ్ల యువకుడు ఈ పని చేసినట్టు కనుగొన్నారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ప్రతాప్ ఈ ట్విట్టర్ ఖాతాను నాలుగు లేక ఐదు రోజుల క్రితం క్రియేట్ చేసినట్టు అధికారులు చెప్పారు. ట్విట్టర్ ఖాతా ఎలా ఆపరేట్ చేయాలో తెలియని ప్రతాప్, విమానంలో బాంబు ఉన్నట్టు సరదాగా ట్వీట్ చేశానని విమానాశ్రయాధికారులకు ఫోన్ లో చెప్పాడట. రాజస్థాన్ పోలీసులకు విషయం వివరించామని, ప్రతాప్ చెప్పిన విషయాలే కాకుండా, దీనిపై పూర్తి సమాచారం అందించాలని అడిగినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News