: గవర్నర్ విందును బహిష్కరించిన టీ కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ ఇఫ్తార్ విందును బహిష్కరించారు. హైదరాబాదులోని రాజ్ భవన్ లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రంజాన్ ను పురస్కరించుకుని రెండు రాష్ట్రాల నేతలు, ప్రముఖులు, ముస్లిం మతపెద్దలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందును తెలంగాణ కాంగ్రెస్ నేతలు బహిష్కరించారు. వర్షాకాల విడిది సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు తమను ఆహ్వానించనందుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు గవర్నర్ విందును బహిష్కరించినట్టు స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రపతి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీ సభ్యులను గవర్నర్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.