: ఉత్కంఠ పోరులో విజయం సాధించిన భారత్...ఆకట్టుకున్న జింబాబ్వే


నేడు హరారేలో జింబాబ్వేతో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఆదిలోనే వికెట్లు కోల్పోయి రాయుడు, బిన్నీ సహకారంతో 255 పరుగులు చేసింది. 256 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన జింబాబ్వే బ్యాట్స్ మన్ ను టీమిండియా బౌలర్లు నిలువరించేందుకు నానాతంటాలు పడ్డారు. దీంతో మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. సిబంద (20), మసకద్జ (34), సికందర్ రాజా (37), చివర్లో క్రీమర్ (27) సహకారంతో చిగుంబుర (104) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడాడు. వికెట్లు పడుతున్నా ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, ఓవర్ కు ఓ ఫోర్, సిక్స్ కొట్టుకుంటూ అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీంతో రెండు జట్ల మధ్య విజయం చివరి వరకు దోబూచులాడింది. చివరి ఓవర్లో అనుభవాన్నంతా రంగరించిన టీమిండియా ప్రధాన బౌలర్ భువనేశ్వర్ కుమార్ కేవలం 5 పరుగులే ఇవ్వడంతో నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన జింబాబ్వే 251 పరుగులు సాధించింది.

  • Loading...

More Telugu News