: 'బాహుబలి'పై అఖిల్ అక్కినేని, నయనతార, ఇతర నటుల స్పందన


'బాహుబలి' సినిమాపై సినీ వర్గం నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. పలువులు సినీ ప్రముఖులు 'బాహుబలి'ని ప్రశంసించారు. 'బాహుబలి'పై ప్రతి భారతీయుడూ గర్వపడాలని, ఇలాంటి సినిమా తీసిన దేశంలో పుట్టినందుకు తామంతా గర్విస్తున్నామని అఖిల్ అక్కినేని ట్వీట్ చేశాడు. ప్రముఖ నటి నయనతార 'బాహుబలి' సినిమా గర్వకారణమని అంది. ఇది అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని, రాజమౌళి దర్శకత్వ ప్రతిభలో టాప్ సినిమా ఇదని పేర్కొంది. తెలుగు సినిమా అంతర్జాతీయంగా విజయం సాధించిన రోజుగా ఈ రోజు నిలిచిపోతుందని నిఖిల్ పేర్కొన్నాడు. 'బాహుబలి' సినిమాను తానే నిర్మించినట్టు అనిపిస్తోందని, అద్భుతమైన సినిమా అని, సినిమా అంటే ఇలా ఉండాలని, రాజమౌళికి శిరసువంచి నమస్కరిస్తున్నానని, రెండో భాగం కోసం వేచి చూడలేనని మంచు లక్ష్మి పేర్కొంది. 'బాహుబలి' అద్భుతమైన సినిమా అని, వర్ణించడానికి మాటలు చాలడం లేదని, రెండో భాగం కోసం ఆగడం కష్టమని, సినీ బృందానికి శుభాకాంక్షలని సంగీత దర్శకుడు రఘు కుంచె ట్వీట్ చేశాడు. మొత్తానికి సినీ పరిశ్రమను బాహుబలి ఆకట్టుకుంది.

  • Loading...

More Telugu News