: కాంగ్రెస్ నుంచి ఆగని వలసలు...వైఎస్సార్సీపీలోకి వెళ్లనున్న మాజీ మంత్రి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ఆగడం లేదు. కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గత నెల వైఎస్సార్సీపీలో చేరగా, ఈ మధ్యనే మాజీ పీసీసీచీఫ్ డీఎస్ టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. వారి బాటలోనే మరో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ నడవనున్నారు. ఈ నెల 13న వైఎస్సార్సీపీలో డొక్కా మాణిక్యవరప్రసాద్ చేరనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.