: ముడుపుల కోసమే పట్టిసీమ నిర్మాణం: ఉండవల్లి
ముడుపుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, పట్టిసీమపై బహిరంగ చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేస్తుందని ఆయన విమర్శించారు. పట్టిసీమ అంచనా వ్యయానికి, వాస్తవంగా పట్టిసీమ కోసం చేస్తున్న ఖర్చుకు మధ్య 206 కోట్ల రూపాయల తేడా ఉందని ఆయన చెప్పారు. దీంతో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంపై పలు అనుమానాలున్నాయని, బహిరంగ చర్చ నిర్వహించాలని ఆయన కోరారు.