: సమ్మె విరమించిన జీహెచ్ ఎంసీ కార్మికులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు ఎట్టకేలకు సమ్మె విరమించారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు ఒప్పుకోవడంతో ఈరోజు సమ్మె విరమిస్తున్నట్టు తెలిపారు. తమ డిమాండ్ల సాధనకోసం నాలుగు రోజులుగా కార్మికులు సమ్మె చేయడంతో నగరంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. దాంతో కార్మిక సంఘాల నేతలతో హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ జరిపిన చర్చలు ఫలించాయి. దాంతో కార్మికుల డిమాండ్లకు అంగీరిస్తూ ప్రభుత్వం తరపున కమిషనర్ లిఖితపూర్వక హామీ ఇచ్చారని టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంస్థ నేత వినోద్ తెలిపారు. 30లోగా తమ డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని మీడియాకు తెలిపారు. తమ డిమాండ్లు అంగీకరించినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.