: రాజీ కోసం తహశీల్దార్ ను చంద్రబాబు ఫోన్ లో బెదిరించారు: వాసిరెడ్డి పద్మ
మహిళా తహశీల్దార్ పై దాడి ఘటనలో ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. మూడు రోజులు గడిచినా ఎమ్మెల్యే చింతమనేని, ఆయన అనుచరులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వెంటనే వారిని అరెస్టు చేయాలన్నారు. అసలు సీఎం చంద్రబాబే తహశీల్దార్ కు ఫోన్ చేసి రాజీకి రావాలని బెదిరించారని పద్మ ఆరోపించారు. నిజాయతీగా పనిచేస్తున్న అధికారిణిపై దాడిచేసి రాజీకి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. విదేశీ పర్యటనల కోసం సీఎం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని, ఏయే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.