: భారత సైన్యం నుంచి భారీ ఆర్డర్ దక్కించుకున్న టాటా మోటార్స్


దేశంలో ప్రముఖ సంస్థగా పేరుగాంచిన టాటా మోటార్స్ భారత సైన్యం నుంచి ఏకమొత్తంలో అతిపెద్ద ఆర్డర్ దక్కించుకుంది. ఆర్డర్ ప్రకారం టాటా మోటార్స్ 1200 మల్టీ యాక్సిల్ ట్రక్కులను సైన్యానికి సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ హై మొబిలిటీ ట్రక్కులను లోడింగ్-అన్ లోడింగ్, మందుగుండు రవాణా, విడిభాగాలు, ఇతర సరంజామా రవాణాకు వినియోగిస్తారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ఆల్ వీల్ డ్రైవ్ ట్రక్కులు కఠిన పరీక్షలకు తట్టుకుని ప్రయోగదశను అధిగమించాయి. ఇవి భిన్న పరిస్థితుల్లో మెరుగైన పనితీరు కనబర్చినట్టు టాటా మోటార్స్ వర్గాలు పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News