: ఈసారి ఇప్పీ నూడుల్స్, బాంబినో మాకరోనీ వంతు


ఇన్ స్టెంట్ ఫుడ్ పేరిట అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతున్న మ్యాగీ నూడుల్స్ ని నిషేధించడంతో ప్రారంభమైన ఫుడ్ తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భారతీయ మార్కెట్ ను ముంచెత్తుతున్న పలు రకాల ఉత్పత్తులను ఫుడ్ అండ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పీ నూడుల్స్ ను గుజరాత్ లో ఎఫ్ డీసీఏ అధికారులు నిషేధించారు. ఎమ్ఎస్ జీ మోతాదుకు మించి ఉండడంతో ఇప్పీ నూడుల్స్ ను నిషేధించక తప్పలేదని ఎఫ్ డీసీఏ కమిషనర్ హెచ్ జీ కోషియా చెప్పారు. ఇప్పీ నూడుల్స్ తో పాటు, బాంబినో మాకరోనీని కూడా నిషేధించినట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News