: విజేతకు ఘనస్వాగతం లేదు... తండ్రి ఆటోలో ఇంటికి చేరుకున్న టీమిండియా మహిళా వికెట్ కీపర్


భారత క్రికెట్లో పురుషులకు, మహిళలకు మధ్య ఎంత వ్యత్యాసం ఉందో తెలిపే సంఘటన ఇది! వివరాల్లోకెళితే... విజయవాడ అమ్మాయి కల్పన భారత మహిళా క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్. ఇటీవలే ఆమె బెంగళూరులో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో పాల్గొంది. ఆ సిరీస్ ను భారత్ అమ్మాయిలు కైవసం చేసుకున్నారు. ఇక, సిరీస్ ముగిసిన తర్వాత స్వస్థలం విజయవాడ వచ్చిన కల్పనకు స్వాగతం పలికేందుకు ఆమె తండ్రి, కాలేజ్ ప్రిన్సిపాల్, లెక్చరర్లు, కొందరు విద్యార్థులు మాత్రమే వచ్చారు. మామూలుగా, భారత పురుషుల క్రికెట్ జట్టుకు విమానాశ్రయాల్లో లభించే స్వాగతం తీరుతెన్నుల గురించి తెలిసిన వారికి ఈ సంఘటన ఎంతో బాధ కలిగిస్తుంది. చివరికి కల్పన తన తండ్రి వెంకటేశ్వరావు ఆటోలోనే ఇంటికి పయనమైంది. ట్రాలీలో లగేజ్ వేసి, ఆటో క్యాబిన్ లో కూర్చుని నివాసానికి చేరుకుంది.

  • Loading...

More Telugu News