: పాటలు డౌన్ లోడ్ చేసి జైలుకు అప్ లోడ్ అయ్యాడు!


ఇజ్రాయెల్ లో ఓ ఔత్సాహిక గాయకుడు మడోన్నా పాటల చౌర్యానికి పాల్పడి జైలుపాలయ్యాడు. అడి లెడెర్మన్ అనే వ్యక్తి పాప్ క్వీన్ మడోన్నా ఆల్బమ్ 'రెబెల్ హార్ట్' ను అక్రమంగా డౌన్ లోడ్ చేశాడు. ఆ ఆల్బమ్ మార్కెట్లోకి రాకముందే అందులోని పాటలు లీకయ్యాయి. అయితే, లెడెర్మన్ వాటిని నెట్ నుంచి డౌన్ లోడ్ చేసి, అమ్మకాలు జరిపాడట. దీంతో, తీవ్ర స్థాయిలో జరిపిన దర్యాప్తు అనంతరం ఆ నూతన గాయకుడి ఘనకార్యం బయటపడింది. న్యాయస్థానం అతడికి 14 నెలల జైలుశిక్ష, 3,900 డాలర్ల జరిమానా విధించింది. ఈ గాయకుడు ఇజ్రాయెల్ లో ఓ టీవీ పాటల కార్యక్రమంలోనూ పాల్గొన్నాడట.

  • Loading...

More Telugu News