: భోపాల్ లో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక విద్యా కేంద్రం


దేశంలో తొలిసారిగా ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక విద్యా కేంద్రం ఏర్పాటు కాబోతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ రాష్ట్రంలోని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ట్రాన్స్ జెండర్ ల కోసం ప్రత్యేక విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. మన దేశంలో మొదటిసారి ట్రాన్స్ జెండర్ ఎమ్మెల్యే ఎన్నికైంది కూడా ఈ రాష్ట్రం నుంచే! ట్రాన్స్ జెండర్ లను సుప్రీంకోర్టు 'థర్డ్ జెండర్'గా ప్రకటించినప్పటికీ సమాజంలో వారు వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు. విద్యాలయాల్లో ప్రవేశంగానీ, ఉద్యోగాలు కల్పించే విషయంలోగానీ వారిని వేరుగా చూస్తునే ఉన్నారు. ఈ క్రమంలో వారికోసం విద్యా కేంద్రం ఏర్పాటు చేయాలని సదరు వర్శిటీ నిర్ణయం తీసుకోవడం విశేషంగా చెప్పాలి. దాని నిర్వహణ బాధ్యతను ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తున్నారు.

  • Loading...

More Telugu News