: బుగ్గ గిల్లి జోకొట్టిన ఉపాధ్యాయుడు!


'బుగ్గ గిల్లి జోకొట్టినట్టు' అనేది ఓ సామెత. అదే తరహాలో ఓ ఉపాధ్యాయుడు ప్రవర్తించాడు. విద్యార్థులను కొట్టి, ఆపై నొప్పితో బాధపతుతున్న వారికి మాత్రలిచ్చి పంపాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని అబ్బినేని గుంటపాలెంలో జరిగింది. గ్రామంలోని పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఉన్న వ్యక్తి పిల్లలను చావచితగ్గొట్టాడు. ఒళ్లంతా వాచిన గాయాలతో ఏడుస్తున్న వారిని సముదాయించి, నొప్పితగ్గే మాత్రలిచ్చి ఇంటికి పంపాడు. ఉపాధ్యాయుడి తీరుపై మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తక్షణం అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News