: చంద్రబాబుకు సాయపడేందుకు 'ముఖ్యమంత్రి'ని తీసుకువస్తున్నారు!


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవ్యాంధ్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం నేపథ్యంలో విదేశీ పర్యటనలు, పెట్టుబడిదారులతో వరుస భేటీలు, కేంద్రం పెద్దలతో సమావేశాలు, మంత్రివర్గ సహచరులతో మంతనాలు... ఇలా తీరికలేని షెడ్యూల్ తో ఆయనకు ఊపిరి సలపదు. అంత బిజీగా ఉన్నా పరిపాలనను విస్మరించడానికి వీల్లేదు. దాంతో, సీఎంకు పాలనలో సహాయపడేందుకు కొత్త ఐటీ మేనేజ్ మెంట్ సిస్టమ్ తీసుకువస్తున్నారు. దానికి "ముఖ్యమంత్రి' అని అప్పుడే నామకరణం చేశారు కూడా. ఈ కొత్త సిస్టమ్ ను రూపొందించే సొల్యూషన్ ప్రొవైడర్ ను జులై 18న స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఈ సిస్టమ్ ట్యాబ్లెట్లకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇది 500 మంది యూజర్ల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. అందులో 30 మంది సీఎంవో సిబ్బంది ఉంటారు. ఈ సరికొత్త ఐటీ సొల్యూషన్ ద్వారా ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ల షెడ్యూల్, పౌరుల నుంచి వచ్చే ఈ-మెయిళ్ల వర్గీకరణ, ఎంపీ, ఎమ్మెల్యే రిఫరెన్స్ మేనేజ్ మెంట్, సీఎం ఆదేశాలు నిర్ణీత కాలవ్యవధిలో అమలవుతున్నాయా? లేదా? అనేది చూడడం, కీలక సమావేశాలు, ప్రాజెక్టు మేనేజ్ మెంట్ తదితర అంశాల్లో ఇది సీఎంకు సాయపడుతుంది.

  • Loading...

More Telugu News