: రెండు గంటల ముందుగానే ముగిసిన సండ్ర రెండోరోజు ఏసీబీ విచారణ
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రెండో రోజు ఏసీబీ విచారణ ముగిసింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన రెండు రోజుల కస్టడీ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4.30 వరకు సండ్రను ఏసీబీ విచారించవచ్చు. కానీ రెండు గంటలకుపైగా సమయం ఉన్నప్పటికీ ముందుగానే విచారణ ముగియడం గమనార్హం. ఆ వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఏసీబీ అధికారులు ఆయనను ఉస్మానియా ఆసుత్రికి తరలించారు. పరీక్షల తరువాత ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఓటుకు నోటు కేసులో వ్యవహారమంతా నడిపింది సండ్రేనని భావిస్తున్న ఏసీబీ అధికారులు ఆ దిశగా ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది.