: గవర్నర్ విందును బహిష్కరించిన టీపీసీసీ
రంజాన్ మాసం సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. అయితే, గవర్నర్ ఇస్తున్న విందును బహిష్కరించాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. నేతలెవరూ గవర్నర్ విందుకు వెళ్లరాదని నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్రపతి నిలయంలో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం పట్ల నిరసనగా పీసీసీ ఈ నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ పీసీసీ తీసుకున్న నిర్ణయం గవర్నర్ ను కొంచెం ఇబ్బంది పెట్టే అంశమే.