: మురుగునీటిలోనే పుష్కర స్నానాలు చేయిస్తారా?: టీఎస్ సర్కారుపై మండిపడ్డ కాంగ్రెస్


టీఆర్ఎస్ ప్రభుత్వంపై టి.కాంగ్రెస్ మండిపడింది. ఈరోజు ధర్మపురి తదితర ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లను కాంగ్రెస్ ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కె.మృత్యుంజయం మాట్లాడుతూ, పుష్కర స్నాన ఘట్టాల ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను అధికారులు మోసం చేస్తుంటే... ఆయన జనాలను మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు. అస్తవ్యస్థంగా, అధ్వానంగా ఉన్న పుష్కర ఏర్పాట్లపై గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News