: ఆ జంటను అదృష్టం రెండు సార్లు పలకరించింది!


అదృష్టం ఒకసారే తలుపు తడుతుందన్నది నానుడి. కానీ రెండు సార్లు తలుపుతడితే... ఐదు లక్షల కోట్ల మందిలో ఒకరికే అలా జరుగుతుందట. ఆ అదృష్టాన్ని ఓ యూరప్ జంట సొంతం చేసుకుంది. యూరో మిలియన్స్ జాక్ పాట్ లాటరీలో 2013లో 10 లక్షల పౌండ్లను (సుమారు రూ. 9.7 కోట్లు) గెలుచుకున్న డేవిడ్ లాంగ్, క్యాథరిన్ జంట, తిరిగి ఈ సంవత్సరం అదే లాటరీని, అంతే మొత్తాన్నీ గెలుచుకుని రికార్డు సృష్టించింది. ప్రపంచ చరిత్రలో ఇదో అరుదైన సంఘటనగా లాటరీ నిర్వాహకులు అభివర్ణించారు. లారీ డ్రైవరుగా పనిచేసే డేవిడ్ లాంగ్ తొలిసారి లాటరీ గెలుచుకోక పూర్వం ఎన్నో ఆర్థిక కష్టాలు అనుభవించాడట. లాటరీ తగిలిన మూడో రోజునే పదవీ విరమణ చేసి, లాటరీ డబ్బుతో హాయిగా గడుపుతున్న ఆ జంట ఆనందానికి ఇప్పుడు అవధులు లేవు.

  • Loading...

More Telugu News