: సీఎం కేసీఆర్ కోసం రేపు 'బాహుబలి' ప్రత్యేక షో!
సినీ ప్రేక్షకుల నీరాజనాలందుకుంటున్న టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చూడబోతున్నారు. ప్రముఖ నిర్మాత, నైజాం డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు సీఎం కోసం రేపు రాత్రి ప్రత్యేక షో ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ షోకు కేసీఆర్ తో పాటు పలువురు తెలంగాణ రాజకీయ నేతలు కూడా హజరై 'బాహుబలి'ని వీక్షించనున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటోంది.